KMR: నాగిరెడ్డిపేటలోని పోచారం ప్రాజెక్టు నుంచి పంటల కోసం సాగునీటి విడుదల కొనసాగుతోంది. యాసంగి పంటల కోసం నేడు 217 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 20 క్యూసెక్కుల నీరు ఆవిరిగా మారి వృథాగా పోతుందని, ఎటువంటి ఇన్ ఫ్లో లేదని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు యాసంగి పంటల కోసం 1.048 TMCల నీటిని విడుదల చేయగా, ప్రస్తుత నీటి మట్టం 1.820 లకు 0.482 TMC నీరు నిల్వ ఉందన్నారు.