రోజూ రెండు కప్పుల తాటి బెల్లం కలిపిన నీళ్లను తాగితే శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా కూడా శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చల్లబడుతుంది. అలాగే, కొబ్బరి నూనె లేదా పొద్దు తిరుగుడు నూనెతో శరీరానికి మర్ధన చేసుకుని స్నానం చేయడం వల్ల కూడా ఒంట్లో వేడి తగ్గుతుంది. క్రమం తప్పకుండా ఎర్ర మందారం టీ తాగడం వల్ల కూడా శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.