AP: ప్రభుత్వాలు మారితే అభివృద్ధి పనులు ఆపేస్తారా అని వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలనే ఈ సభ నిర్వహించామన్నారు. కూటమి నాయకులు వారి స్వార్థం కోసమే పనిచేస్తున్నారని, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కూటమి ఏం చేస్తోందని మండిపడ్డారు. వలసల నివారణకు మూలపేట పోర్టుకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు.