ప్రకాశం: బేస్తవారిపేట మండలం మోక్షగుండంలో గొర్రెల గుంపు పైకి ప్రైవేట్ బస్సు దూసుకు వెళ్ళింది. గురువారం అర్ధరాత్రి సమయంలో జాతీయ రహదారిని దాటుతున్న గొర్రెల గుంపుని ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో 30 గొర్రెలు మృతి చెందాయి. దాదాపు రూ.2 లక్షలు ఆర్థికంగా నష్టపోయారని రైతు వాపోయాడు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.