SDPT: జగదేవపూర్ మండల పరిధిలోని నిర్మల్ నగర్ గ్రామానికి చెందిన రైతు కర్రె మల్లేశం (48) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ అవసరాలు, కుమార్తె వివాహం కోసం చేసిన అప్పులు పెరిగిపోవడం, ఆదాయం సరిపోకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. భూమి అమ్మడానికి ప్రయత్నించినా కొనుగోలుదారులు దొరకలేదు. దీంతో పురుగుల మందు తాగి మరణించాడు.