SKLM: రైతులకు సాగునీరు అందించేందుకు నిర్మించిన వంశధార ఎడమ కాలువ గట్లు రోజురోజుకు అక్రమ ఆక్రమణలకు గురవుతున్నది. ప్రధాన రహదారి పక్కనే కాలువ గట్లను దర్జాగా కబ్జా చేసుకుని కొందరు నేల బావుల నందలు తయారీ కుటీర పరిశ్రమగా తయారు చేశారు. గట్టును పూర్తిస్థాయిలో ఆక్రమణలు చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోలేదని స్థానికుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.