తిరుపతి ఎస్వీయూ బాటనీ విభాగం ఆధ్వర్యంలో జూన్ 11 నుంచి 15 వరకు ఐదు రోజుల వర్క్‌షాప్ జరగనుంది. పద్మశ్రీ సుభాష్ పాలేకర్ మార్గదర్శకత్వంలో ఆర్గానిక్ ఫార్మింగ్ శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమ పోస్టర్‌ను వీసీ ఆచార్య టాటా నరసింగరావు, రెక్టార్ ఆచార్య అప్పారావు, రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు, బాటనీ విభాగ ఆచార్యులు విజయ ఆవిష్కరించారు.