GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గంలో శుక్రవారం ‘ఒక నెల-ఒక నియోజకవర్గం- నాలుగు సందర్శనలు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ వెల్లడించారు. ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెంలో ఉదయం 9.30 గంటలకే ఈ కార్యక్రమం మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొనాలని తెలిపారు.