JGL: రైతులు సేంద్రియ ఎరువుల వాడకపై దృష్టి సారించాలని పెగడపల్లి మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ అన్నారు. గురువారం పెగడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు సాగుకు ముందు భూసార పరీక్షలు నిర్వహించి దానికి అనుగుణంగా పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులు సాధిస్తారని సూచించారు.