TPT: తిరుమల ఘాట్ రోడ్లలో జరుగుతున్న ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా రోడ్డు భద్రత కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండేళ్ల ప్రమాదాల వివరాలను టీటీడీ విజిలెన్స్ సమర్పించాలని ఆదేశించింది. తిరుపతి-తిరుమల మధ్య నడిచే జీపులు, సుమోలు ఫిట్నెస్పై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని DTOకు సూచించింది. ఘాట్ రోడ్లలో వాహనాల వేగం, ప్రయాణ సమయాలపై నిఘా పెంచనున్నారు.