CTR: పుంగనూరు గ్రామ దేవతల పూజలు అందుకుంటున్న శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను ఫల పంచామృతాలతో పాటు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు.