SS: జిల్లాలో పెరుగుతున్న తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు మధ్యాహ్నం వేళల్లో బయటకు రాకూడదన్నారు. అత్యవసరమైతే గొడుగు, టోపీ ధరించాలని, ఓఆర్ఎస్, మజ్జిగ తాగాలన్నారు.