KNR: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు వేగవంతం చేయాలని చిగురు మామిడి తహసీల్దార్ ముద్దసాని రమేష్, ఎంపీడీవో తూమట్ల విజయకుమార్ సూచించారు. గురువారం చిగురుమామిడి మండలంలోని సుందరగిరి, నవాబుపేట, గాగిరెడ్డిపల్లె, ఇందుర్తి, గునుకులపల్లి, ఓగులాపూర్ గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు సంయుక్తంగా పరిశీలించారు.