SDPT: చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్‌లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారనే నమ్మదగిన సమాచారంతో సిద్దిపేట టాస్క్ ఫోర్స్, చిన్నకోడూరు పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. రెండు బెల్టు షాపుల నుంచి 46 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు.