PDPL: గోదావరిఖనికి చెందిన రావులపల్లి రాధాకృష్ణ (42) అనే పెయింటర్ గురువారం మరణించినట్లు వన్ టౌన్ ఎస్సై మనోహర్ తెలిపారు. శివాజీనగర్ కూరగాయల మార్కెట్ సమీపంలో ఆయన అపస్మారక స్థితిలో పడి ఉండగా ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.