TPT: ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్రకు చెందిన 50 మంది విద్యార్థులు, అధ్యాపకులు గురువారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ప్రపంచ స్థాయి సదుపాయాలపై వారికి అవగాహన కల్పించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సంస్థ అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల గురించి వివరించారు.