ASF: జైనూర్ మార్కెట్ కమిటీ గోదాంలో పీఏసీఎస్, మార్కెఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు దళారులకు అమ్మి మోస పోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే జొన్నలు విక్రయించాలని సూచించారు. మార్ఫెడ్ ద్వారా క్వింటాల్ జొన్నకు రూ. 3,699 మద్దతు ధర చెల్లిస్తామని తెలిపారు.