మన్యం: కొమరాడ మండల పరిధిలోని విక్రంపురం స్వర్ణ సచివాలయాన్ని జె. సి.యశ్వంత్ కుమార్ రెడ్డి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయంలో ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు వివరాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు సకాలంలో అందించాలని సూచించారు.