ATP: కుందుర్పి మండలం వెంకటంపల్లి, జంబుగుంపల పరిసర ప్రాంతాల మధ్య వారం రోజులుగా చిరుతలు సంచరిస్తూ కుక్కలు, మూగజీవా లను ఎత్తుకెళుతున్నట్లు ఆయా గ్రామ ప్రజలు తెలిపారు. జంబుగుంపల్లో 2 రోజుల క్రితం రెండు కుక్కలను చిరుత ఎత్తుకెళ్లిందన్నారు. రాత్రిళ్లు పొలాలకు వెళ్లే మార్గాల్లో చిరుత తారసపడుతుడడంతో రైతులు భయాం దోళనకు గురవుతున్నారు.