AP: కాకినాడ జిల్లాలోని 2 పోలీస్స్టేషన్లలో ప్రొ.నాగేశ్వర్‌పై కేసులు నమోదయ్యాయి. ఇంద్రపాలెం, సర్పవరం PSలలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ప్రొ.నాగేశ్వర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఇంద్రపాలెంలో శ్రీనివాసరావు, సర్పవరంలో శ్రీరాములు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.