KKD: కాజులూరు, తాళ్లరేవు, కరప, రూరల్ మండలాల్లో 43-45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు కలెక్టర్ హరేంధరప్రసాద్ తెలిపారు. మరో వారం రోజుల పాటు ఇవే ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గురువారం మండల స్థాయి అధికారులతో నిర్వహించిన కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని ఆదేశించారు.