TG: ఇవాళ ఎంపీలు, ఎమ్మెల్యేలతో బీజేపీ చీఫ్ రామచందర్ రావు సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే అంశాలపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు.