దేశంలో ఆర్థిక సంక్షోభం ఉంటే, ప్రధాని మోదీ ఇటలీలో కాలక్షేపం చేయడం హాస్యాస్పదమని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. రీల్స్ చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంపై లేదని ఆమె మండిపడ్డారు. దేశంలో మహిళలు, రైతులు, యువత ఇబ్బందుల్లో ఉంటే, ప్రధాని విదేశాల్లో నవ్వుతూ గడపడం సిగ్గుచేటని, ఆయనకు నాటకాలపై ఉన్న శ్రద్ధ దేశ నాయకత్వంపై లేదని ఆమె ఆరోపించారు.