WNP: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు, క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం కల్పిస్తుందని, వనపర్తి నుంచి ఫుట్బాల్ క్రీడలో అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు ఎదగాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి సూచించారు. పెబ్బేరు మండలంలో ఫుట్బాల్ మైదానంలో అభివృద్ధి కోసం పది లక్షల వ్యయంతో కూడిన పనులకు శంకుస్థాపన చేశారు. క్రీడాకారులు పాల్గొన్నారు.