మంచు మనోజ్ హీరోగా హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో ‘డేవిడ్ రెడ్డి’ చిత్రం సిద్ధమవుతోంది. బ్రిటిష్ వారిపై పోరాడిన ఓ యోధుడి కథాంశంతో వస్తున్న ఈ మూవీ ప్రస్తుతం డబ్బింగ్ దశలో ఉందట. మనోజ్ తన మార్క్ డైలాగ్ డెలివరీతో అలరించనున్నాడట. కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులను చిత్ర బృందం శరవేగంగా పూర్తి చేస్తోంది.