TG: ద్వేషపూరిత ప్రసంగాలు, నేరాల బిల్లుపై అసెంబ్లీలో సభ్యులు చర్చిస్తున్నారు. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీ పంపాలని ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, బలాల, వంశీకృష్ణ, లక్ష్మారెడ్డి, యశస్విని కోరారు. అయితే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కూనంనేని సాంబశివరావు తెలిపారు. కాగా, ఈ బిల్లుకు దానం నాగేందర్, రాజేష్ రెడ్డి మద్దతు పలికారు.