WGL: GWMC 14వ డివిజన్ పరిధి ఏనుమాముల సాయిగణేష్ కాలనీలో రోడ్ల పరిస్థితి ఇది. గత 20 ఏళ్లుగా తమ కాలనీలో రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. గత నాలుగు నెలల క్రితం MLA ఈ ప్రాంతాన్ని సందర్శించగా రోడ్లు వేయాలని స్థానికులు కోరారు. స్పందించిన MLA రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికీ అది కార్యరూపం దాచలేదని, రోడ్లు వేయాలని కోరారు.