KRNL: ఐపీఎల్ సందర్భంగా బెట్టింగ్‌ల జోలికి వెళ్లవద్దని పెద్దకడబూరు మండల SI మారుతి ఇవాళ హెచ్చరించారు. బెట్టింగ్ కార్యకలాపాల్లో పాల్గొన్న, ప్రోత్సహించిన కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువత ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని, సులభంగా డబ్బు సంపాదించే ఆశతో బెట్టింగ్‌లలో పాల్గొనకూడదని సూచించారు. పోలీసుల పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు.