పెళ్లికి ముందు అందంగా, నాజూగ్గా కనిపించేందుకు వధూవరులు కొత్త దారి వెతుకుతున్నారు. బరువు తగ్గేందుకు ‘మౌంజారో’ వంటి ఇంజెక్షన్లను ఆశ్రయిస్తున్నారు. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ‘మౌంజారో బ్రైడ్’ ప్యాకేజీలకు గిరాకీ పెరుగుతోంది. వేగవంతమైన ఫలితాల కోసం వీటిని వాడుతున్నారు. అయితే, వీటిని కేవలం వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలని, సొంత నిర్ణయాలు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.