MBNR: పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యం అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శుక్రవారం హెల్త్ కిట్లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డలు కాన్పుకు వచ్చినప్పుడు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో హెల్త్ కిట్లను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.