TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పోవాలని 10 ఏళ్ల తర్వాత ప్రజలు అనుకున్నారని.. కానీ రేవంత్ పోవాలని రెండేళ్లకే అనుకుంటున్నారని తెలిపారు. ప్రాణహిత జలాలను వాడుకోవడంలో సీఎం నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తల కోరిక మేరకే ఇతర పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు.