GNTR: ప్రత్తిపాడు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి ఆయన నేరుగా అర్జీలు స్వీకరించారు. సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో జాప్యం జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలుకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పుకొచ్చారు.