కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు రైతులకు కొత్త పట్టాదారు పాసుక్లను ఇవాళ అందజేశారు. భూ రీ-సర్వే, రాష్ట్ర రాజముద్ర ప్రక్రియ తర్వాత పాస్ బుక్కులు పంపిణీ చేయడం ద్వారా రైతులకు భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో తారుమారైన భూ సమస్యలను పరిష్కరించామని ఎంపీ నాగరాజు పేర్కొన్నారు.