KMM: వైరా మున్సిపాలిటీలో నేడు నిర్వహించిన గుడ్ ఫ్రైడే కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ డాక్టర్ కాప చంద్రకళ మురళీకృష్ణ పాల్గొన్నారు. వారితోపాటు 20వ వార్డు కౌన్సిలర్ వరలక్ష్మి శ్యాంబాబు పాల్గొని యేసు క్రీస్తు సిలువ మోశారు. క్షమించడంలోనే నిజమైన విజయం ఉందని చాటి చెప్పిన క్రీస్తు త్యాగాన్ని స్మరించుకుని ఈ గుడ్ ఫ్రైడే నిర్వహించుకుంటామని ఆమె తెలిపారు.