గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతోంది. ఏప్రిల్ 30, 2026న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా మరోసారి వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో 2026 జూన్లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.