AP: రాజమండ్రి జిల్లా కోర్టులో లక్ష్మీదుర్గ హాజరయ్యారు. దళిత యువకుడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ విచారణ పూర్తయింది. హైకోర్టు ఆదేశాలతో ఈనెల 16 నుంచి సిట్ ఎదుట విచారణకు ఆమె హాజరయ్యారు. హత్య కేసులో సుదీర్ఘంగా విచారణ సాగింది. సిట్ అధికారులు 12 రోజుల్లో 84 గంటలపాటు ఆమెను ప్రశ్నించారు.