AP: మావోయిస్టుల లొంగుబాటుపై డీజీపీ హరీష్ గుప్తా వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధ డంప్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ, డివిజనల్, ఏరియా కమిటీలకు చెందిన మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. 35 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న శ్రీకాకుళం జిల్లా బాతుపురానికి చెందిన చెల్లూరి నారాయణరావు అలియాస్ సోమన్న లొంగిపోయినట్లు పేర్కొన్నారు.