TG: లోక్‌భవన్‌లో శివ్ ప్రతాప్ శుక్లాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం కలిసింది. మంత్రి పొంగులేటిపై ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ శివారు వట్టినాగులపల్లిలో రూ. 1400 కోట్ల భూమిపై పొంగులేటి కబ్జా చేస్తున్నారని.. దీనిపై చర్యలు తీసుకోవాలని MLAలు కోరారు. పొంగులేటిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని తెలిపారు. ఈ బృందంలో కేటీఆర్, హరీష్ రావు పాల్గొన్నారు.