TG: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లును సెలెక్ట్ కమిటీకి స్పీకర్ సిఫార్సు చేశారు. ఈ బిల్లుపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించిన తర్వాత.. పలువురు సిఫార్సు కమిటీకి పంపించాలని కోరారు. దీంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, శాంతిభద్రతలను కాపాడటానికి, వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రసంగాలను అరికట్టడానికి ఈ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొస్తుంది.