KMR: తమకు గ్రామంలోని ఆలయాల్లో ప్రవేశం చేయిస్తామని హామీ ఇచ్చి ఉన్నతాధికారులు రాకపోవడంతో పాటు డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐలను పంపడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. పోలీసులు చివరకు ఆర్డీవోతో ఫోన్ మాట్లాడించడంతో దళితులు శాంతించారు. ఈ ఘటన కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.