దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి జనగణన-2027 ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి దశలో భాగంగా అధికారులు ఇళ్ల గణన చేపట్టనున్నారు. ప్రతి రాష్ట్రానికి 30 రోజుల వ్యవధి ఉంటుందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పదేళ్లకోసారి దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణన 2021లో చేపట్టాల్సి ఉండగా.. కొవిడ్ కారణంగా వాయిదా పడింది. తాజాగా దీనిని చేపట్టాలని నిర్ణయించింది.