ASR: జిల్లాలో వ్యవసాయేతర రుణాలు పెంచుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు రైతులకు అందే విధంగా చూడాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను పెట్టుబడి రుణ సహాయంతో ప్రోత్సహించాలన్నారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టా కలిగి ఉన్న రైతులకు రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు.