BPT: చీరాల 25వ వార్డులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన ఇళ్లను ఎమ్మెల్యే మాలకొండయ్య ఇవాళ ప్రారంభించారు. పేదలకు సొంత ఇంటి కల నిజమవుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో గృహాలు పూర్తవడం అభివృద్ధికి సంకేతమని పేర్కొన్నారు. ఈ పథకం కుటుంబాల జీవన స్థాయిని మెరుగుపరుస్తుందని చెప్పుకొచ్చారు.