సత్యసాయి: పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలోని భువన విజయం భవన హాల్లో ఇవాళ జీరో పావర్టీ–P4 కార్యక్రమం, బంగారు కుటుంబాల ప్రథమ వార్షికోత్సవం నిర్వహించారు. పెనుకొండ ఆర్డీవో ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. పథకం లక్ష్యాలు, అమలు విధానం గురించి వివరించారు. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.