SDPT: బెజ్జంకి మండలంలో ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమయ్యే జాతర ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం 5 గంటలకు టీటీడీ కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించనున్నట్లు ఎస్సై బోయిని సౌజన్య తెలిపారు. మండలంఃలోని వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, యువకులు, ఆలయ కమిటీ సభ్యులు హాజరుకావాలని కోరారు. జాతర నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతలపై చర్చించి సూచనలు ఇవ్వనున్నట్లు ఎస్సై వెల్లడించారు.