ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఒక హత్య కేసు చేదనలో SP నితిక పంత్ సఫలీకృతులయ్యారు. 2022 సంవత్సరంలో పెంచికల్పేట్ మండలానికి చెందిన సాగర్ అనే వ్యక్తి శవమై కనిపించగా పోలీసులు హత్యగా నిర్ధారించి కేసు నమోదు చేశారు. 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కేసును చేధించి నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరు పరచి రిమాండ్కు పంపించారు.