TG: శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు వామనరావు దంపతుల హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో పట్టపగలే వారిని దారుణంగా హత్య చేశారని, దీని వెనుక ఆ పార్టీ నేతల ప్రోద్భలం ఉందని ఆరోపించారు. నాడు బాధితుల కుటుంబాలకు కనీస న్యాయం కూడా జరగలేదని ఆయన విమర్శించారు. ఆనాడు జరిగిన ఈ అన్యాయాన్ని మంత్రి అసెంబ్లీ వేదికగా తీవ్రంగా ఎండగట్టారు.