AP: అమరావతి భద్రతపై ఎస్పీ జిందాల్ స్పందించారు. ‘విద్రోహక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. అమరావతిలో చెక్‌పోస్టులు ఏర్పాటు. రాత్రి సమయంలో డ్రోన్ కెమెరాలతో నిఘా. నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు. నిర్మాణ సంస్థలు కెమెరాలు, సెక్యూరిటీ పెట్టుకోవాలి. ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి’ అని ఆయన సూచించారు.