NLG: టీజీఎస్ఆర్టీసీలో ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ నల్గొండ డిపో వద్ద కార్మికులు సోమవారం అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ‘గో బ్యాక్ ఈవీ బసెస్’ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం సొంతంగా బస్సులను కొనుగోలు చేసి, సొంత సిబ్బందితోనే నడపాలని, ప్రైవేటీకరణను ఆపాలని జేఏసీ డిమాండ్ చేసింది.