బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబోలో భారీ సినిమాకు రంగం సిద్ధమైంది. దిల్ రాజు ప్రొడక్షన్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ క్రేజీ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైంది. ఏప్రిల్ 2026 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ పాన్-ఇండియా మూవీతో వంశీ బాలీవుడ్ కండల వీరుడిని ఎలా చూపిస్తారోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.